

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ట్రూఅప్ ఇంధన సర్దుబాటు చార్జీలను తక్షణమే రద్దు చేయాలి అదానీ స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణం ఆపాలి. ఇప్పటికే బిగించిన వాటిని తొలగించాలి అంటూ. సిపిఐ ఎంఎల్ నాయకుడు కోసి రెడ్డి గణేశ్వరరావు. పిలుపు మేరకు సిపిఐ ఎం ఎల్ వినోద్ మిశ్రా.అఖిలభారత మహిళ సంగం నాయకత్వంలో మహిళలు కొవ్వొత్తులు పట్టుకుని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వ ఆదేశిత విధానాల్లో భాగంగా విద్యుత్ ప్రైవేటీకరణ విధానాలను వేగవంతం చేస్తున్నది. మేము అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లను రద్దు చేస్తామని, స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే పగలగొట్టండి అని పిలుపిచ్చిన కూటమి నాయకులు నేడు అధికారంలోకి వచ్చాక ఊసరవెల్లి రంగులు మార్చినట్టు మాట మార్చి, గత ప్రభుత్వ విధానాల్నే అమలు చేస్తున్నాయి. ట్రూఅప్,ఇంధన సర్దుబాటు పేరుతో గతంలో వాడిన విద్యుత్ కు ఇప్పుడు చార్జీల భారాలను వేస్తున్నది. కరెంట్ చార్జీలు పెంచడం, స్మార్ట్ మీటర్లు బిగించడం విద్యుత్ వినియోగదారుల అందరికీ అనగా వర్తక, వాణిజ్య,పరిశ్రమ, వ్యవసాయం, చిన్న, మధ్య తరహా, గృహస్తులు అందరికీ ప్రమాదకరమైన చర్య. స్మార్ట్ మీటర్ల బిగింపుకు అయ్యే ఖర్చు కూడా ప్రజల నెత్తినే వేస్తారు.సింగల్ ఫేస్ కు 9వేలు, త్రీ ఫేస్ కు 18వేలు చొప్పున అయ్యే ఖర్చును 93 నెలల పాటు విద్యుత్ వినియోగదారులందరి నుండి వసూలు చేయబోతున్నారు.గత నాలుగు దశాబ్దాలుగా విద్యుత్తు వినియోగం విస్తరించి,ప్రజలకు ఒక నిత్యవసర వస్తువుగా మారింది.ఈ క్రమంలోనే పాలకులు విద్యుత్ రంగాన్ని ప్రైవేటుకరిస్తూ వచ్చారు.నేడు విద్యుత్ సంస్కరణల పేరుతో ఆ విధానాలను దేశవ్యాప్తంగా వేగవంతం చేస్తున్నారని అన్నారు.ఈ సందర్భంగా గండేటి నాగమణి మాట్లాడుతూ విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు లాభాలను చేకూర్చి, ప్రజలపై భారాలను మోపేందుకే ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఉద్యమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కందుల వరలక్ష్మి, గుమ్మడి పాదాలమ్మ, గోనాపు సాయి, పల్లపా సుందరి, దుఃఖ నూకమ్మ, పల్లి బోయిన లోవ ప్రసాదు, ఇంజుమల్ల అప్పలరాజు, కొంతం సోమరాజు, తదితరులు.పాల్గొన్నారు.