

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ :
ఏలేశ్వరం భాజపా కార్యాలయంలో నూతన కార్యవర్గ కమిటీ ఎన్నికచేసుకోవడం జరిగింది. మంగళవారం నిర్వహించిన ఈ ఎంపికలో ఏలేశ్వరం రూరల్ మండల అధ్యక్షులు నీలి సురేష్ అధ్యక్షతన కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ పూర్వ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా పూర్వ ఉపాధ్యక్షులు ఉమ్మిడి వెంకట్రావు, కాకినాడ జిల్లా మాజీ సైనిక విభాగ కన్వీనర్ కర్రి ధర్మరాజు, ఏలేశ్వరం రూరల్ మండల పూర్వ అధ్యక్షులు కూరాకుల రాజాల ఆధ్వర్యంలో నూతన కమిటీల ఎన్నికలు జరిగాయి. ఈ కమిటీల్లో మండల వైస్ ప్రెసిడెంట్ లుగా కొప్పిశెట్టి సత్యనారాయణ , పతివాడ వెంకటేశ్వరరావు, దాసం. వి.వి సత్యనారాయణ , ఆలేటి నాగేశ్వరరావు, పేకేటి నాగేశ్వరరావు , ఎలుగుబంటి సూరిబాబు
మండల జనరల్ సెక్రెటరీలు గా
కరెడ్ల యేసుబాబు, పోలినాటి వీవీ సత్యనారాయణ , ముళ్ళ మాధవ్.
ఏలేశ్వరం యువ మోర్ఛ ప్రెసిడెంట్ గా గరిక నాగు, మహిళా మోర్ఛ ప్రెసిడెంట్ తమరాల సత్యవతి , ఎస్సీ మోర్చ ప్రెసిడెంట్ ఏడిద వీర నాగు , కిసాన్ యువ మోర్ఛ ప్రెసిడెంట్ కూరకుల బలరాముడు , ఓబీసీ మోర్చ ప్రెసిడెంట్ అలేటి అనిల్ కుమార్ మరియు ఎస్ టి మోర్చ ప్రెసిడెంట్ సూర్ల గంగ రాజు ఎన్నుకోవటం జరిగింది.
నూతన సభ్యులను ఎన్నుకుని పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రమాణాలను చేయించారు.ప్రాంతాలవారీగా పార్టీ బలోపితం చెయ్యాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.