కవి శేఖరుడు గురజాడకు ఘనంగా నివాళి

మన న్యూస్: తిరుపతి, ప్రముఖ తెలుగు రచయిత గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి అని రాయలసీమ రంగస్థలి ఛైర్మెన్ గుండాల గోపినాధ్ అన్నారు. గురజాడ 109 వ వర్ధంతిని చిగోరా ఆధ్యాత్మిక కేంద్రం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు ఈ సందర్భంగా గుండాల గోపీనాధ్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో గురజాడ అప్పారావు ఒకరని గుర్తు చేసారు. 19వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ అతను చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయన్నారు . అతను ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేసారు. వీరి కన్యాశుల్కము నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని పేర్కొన్నారు. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు. ఆయనకు కవి శేఖర అనే బిరుదు ఉందని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, చిగోరా ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు, రంగస్థలి సభ్యులు విజయభాస్కర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, రామలింగేశ్వర కుమార్,చిత్తరపు శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ప్రత్తిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం లో మంగళవారం నూతన కమిటీ కార్యక్రమం ఆటో డ్రైవర్స్ యూనియన్ వారు నిర్వహించారు.ఏలేశ్వరం శ్రీ సాయి దుర్గ భవాని అండ్ జై దుర్గ భవాని ఆటో యూనియన్ నూతన కమిటీని ఎంపిక చేశారు.గౌరవ అధ్యక్షులుగా కుప్పల నాగభూషణం,…

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    మన ధ్యాస ,న్యూఢిల్లీ /నెల్లూరు, డిసెంబర్ 16:నెల్లూరు జిల్లా పరిధిలో రైల్వే ప్రాజెక్టుల పూర్తి చేయడమే లక్ష్యంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డి ప్రభాకర్ రెడ్డి పని చేస్తున్నారు. ఈ మేరకు భారత రైల్వే బోర్డు చైర్మన్ సంతోష్ కుమార్ ను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి