కావలి, మన ధ్యాస, నవంబర్ 25 : నెల్లూరు జిల్లా, కావలి పట్టణం లో, క్రిస్టియన్ పేట,ఆరవ వీధిలో బుధవారం ఉదయం కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి డాక్టర్ మహేష్ సర్జికల్,గ్యాస్ట్రో హాస్పిటల్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దగుమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ…….. గ్యాస్ట్రో కు సంబంధించిన వైద్య సేవలకు ,ఆపరేషన్లలకు దూర ప్రాంతాలకు వెళ్లకుండా కావలి పట్టణంలోనే ప్రజలకు లభించడం శుభ పరిమాణం అని తెలిపారు. జనరల్,లాప్రోస్కోపిక్,లేజర్ బేరియాట్రిక్ సర్జన్లలో ఆపరేషన్ లలో అనుభవం గడించి, అత్యాధునిక పరికరాలతో హాస్పిటల్ ప్రారంభించడం డాక్టర్ మహేష్ ను ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి అభినందించారు.డాక్టర్ మహేష్, డాక్టర్ హిమబిందు లు ప్రజలకు గ్యాస్ట్రో వైద్య సేవలు అందించవలసిన కోరారు. డాక్టర్ పి.వి. ఎస్.మహేష్ మాట్లాడుతూ….. నేను ఎంబిబిఎస్, ఎంఎస్, ఎఫ్ఎన్బి జనరల్ సర్జరీ,లాప్రోస్కోపిక్, లేజర్ సర్జన్ స్పెషలిస్ట్ అని తెలిపారు.మా హాస్పిటల్లో సర్జరీ, మెడికల్ గ్యాస్ట్రో సర్జరీ పెద్ద కోతలు లేకుండా చిన్న రంధ్రాల ద్వారా లేజర్ పద్ధతి ద్వారా చికిత్స చేయడం జరుగుతుంది అని తెలిపారు. ఫైల్స్ కూడా పెద్ద కోతలు సర్జరీ చేయడం జరుగుతుందని అని తెలిపారు. గ్యాస్ట్రో సంబంధించిన వైద్య సేవలు ఇప్పుడు కావలి పట్టణంలో ప్రజలకు అందుబాటులో ఉన్నాయి అని తెలిపారు. కావున ప్రజలందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ…… కావలిలో ఎండోస్కోపిక్ మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వైద్య సేవలు ఇప్పుడు వరకు లేవు,కనుక ఇప్పుడు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు. కావున ప్రజలందరూ మా సేవలో వినియోగించుకోవలసినదిగా కోరారు. . ఆర్యవైశ్య ప్రముఖులు తటవర్తి రమేష్ మాట్లాడుతూ….. డాక్టర్ మహేష్ సర్జికల్, గ్యాస్ట్రో హాస్పిటల్ కావలి లో ప్రారంభించడం ప్రజల అదృష్టం అని తెలిపారు. ఈ ప్రారంభానికి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి రావడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు. డాక్టర్ మహేష్ నాకు నెల క్రితం గ్యాస్ట్రోకు సంబంధించిన ఆపరేషన్ చేశారు.డాక్టర్ పివీఎస్ మహేష్, డాక్టర్. హిమబిందు ల ఆధ్వర్యంలో కావలిలో హాస్పిటల్ ప్రారంభించటం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు. అనుభవం గడించి కావలిలో అత్యాధునిక వైద్య పరికరాలతో హాస్పిటల్ 24 x 7 అందుబాటులో ఉంటుంది అని తెలిపారు. డాక్టర్ రవికాంత్ షుగర్ స్పెషలిస్ట్ మాట్లాడుతూ….. డాక్టర్ మహేష్ ఆధ్వర్యంలో సర్జికల్, సర్జికల్ గ్యాస్ట్రో హాస్పిటల్ ప్రారంభించడం శుభ పరిమాణం అని అన్నారు. గ్యాస్ట్రో సంబంధించిన వైద్య సేవలను లకు దూర ప్రాంతాలకు వెళ్లకుండా కావలి ప్రజలకు లభించడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు. కావున ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవలసినదిగా కోరారు.ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులు డాక్టర్ మహేష్, డాక్టర్ హిమబిందు లను శాలువలతో సత్కరించి, అభినందించారు. ఈ ప్రారంభోత్సవంలో డాక్టర్ మహేష్, డాక్టర్ హిమబిందు ల బంధుమిత్రులు,శ్రేయోభిలాషులు డాక్టర్స్ తదితరులు పాల్గొన్నారు.








