• గ్రామ సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అంటూ హామీ.

గాజువాక మన ధ్యాస ప్రతినిధి నవంబర్ 27: పెద్ద గంట్యాడ మండలం జీవీఎంసీ 95వ వార్డు పరిధిలోని అయ్యన్నపాలెం గ్రామంలో 95 వ వార్డ కార్పొరేటర్ శ్రీమతి కోన రాధిక,వెంకటేష్ దంపతులకు ముందుగా గ్రామ దేవతలు అమ్మవార్లను దర్శించుకున్నారు.అనంతరం గ్రామ మహిళలు కార్పొరేటర్ దంపతులను సాలువా పుష్పగుచ్చంతో ఘనంగా సత్కరించారు. తదనంతరం 95 వార్డు కార్పొరేటర్ చేతుల మీదుగా కేక్ కటింగ్ చేసి విజయానికి శుభాకాంక్షలు తెలిపారు గ్రామస్తులు. తదనంతరం గ్రామ మహిళలు తమ గ్రామ సమస్యల్ని కార్పొరేటర్ కి వివరించారు. సమస్యల పట్ల 95 వార్డ్ కార్పొరేటర్ స్పందిస్తూ వాటిలో సమస్యలన్నిటిని కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా95 కార్పొరేటర్ కోన రాధిక,వెంకటేష్ మాట్లాడుతూ గ్రామంలో పలు సమస్యలపై స్పందిస్తూ మీ సమస్యలన్నిటికీ వేగవంతంగా పరిష్కారం చేయటానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల హామీలో మీకు ప్రకారం 95 వార్డులో ఎటువంటి సమస్య అయినా త్వరితగతిన పనులు పూర్తి చేస్తానని అలాగే మీకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యని కూడా అధికారులు చేత ఆ పనిని పూర్తి అయ్యే విధంగా చర్యలు చేపట్టి గ్రామంలో ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకుంటానని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *