

మన న్యూస్: తిరుపతి నగరం గోవింద నామస్మరణలతో మారు మ్రోగింది.. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తి భావాన్ని మరింత పెంచాలని సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారము నగరంలో గోవింద నామ సంకీర్తనలను చేపడుతున్నారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండల కళాకారులు భక్తులు తిరుణామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పెట తాళాలతో నగరంలో గోవింద నామ సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా.నగర సంకీర్తన మండలి సభ్యులు. చిత్తరపు హనుమంతరావు రామకృష్ణారెడ్డి భరత్ విరూపాక్షి కుమార్ రెడ్డి మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజని గుర్తు చేశారు. అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదం పంపిణి చేశారు కార్యక్రమములో.సూర్య ప్రకాష్.గుండాల గోపీనాథ్ రాజశేఖరరెడ్డి మునినాథ రెడ్డి వాసుదేవరెడ్డి తొండము నాటి సుబ్రహ్మణ్యం రెడ్డి వాసు విజయ భాస్కర్ రెడ్డి విక్రమ్ స్వామి నరసింహారెడ్డి కృష్ణమూర్తి రెడ్డి మేకల గంగయ్య మురళి రెడ్డి బాబు విగ్రహాల కళ్యాణి జయమ్మ పద్మావతి పాల్గొన్నారు