

మన న్యూస్: తిరుపతి, స్థానికులకు శ్రీవేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం ఈనెల మూడవ తేదీ నుంచి ప్రారంభంకానున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. స్వామి దర్శనం పొందేందుకు సోమవారం ఉదయం నుంచి టిటిడి టోకన్లు జారీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. తిరుపతి వాసులు మహతి ఆడిటోరియంలో, తిరుమలవాసులు బాలాజీనగర్ లోని కమ్యూనిటీ హాల్ లో మంగళవారం ఉదయం ఐదు గంటల నుంచి టోకన్లు పొందవచ్చని ఆయన తెలిపారు. స్వామి దర్శనంకు వెళ్లే వాళ్ళు తమ ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్ళి టోకన్లు పొందవచ్చని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని గత నెల 18వ తేదీ జరిగిన టిటిడి పాలకమండలి తొలి సమావేశంలోనే పునరిద్ధరించినట్లు ఆయన గుర్తు చేశారు. తిరుపతి, తిరుమల వాసులతోపాటు తిరుపతి రూరల్, రేణిగుంట, చంద్రగిరి వాసులకు శ్రీవారి దర్శనం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కల్పించడం గొప్ప విషయమన్నారు. స్థానికులకు శ్రీవారి దర్శనం పునరుద్ధించడానికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు, సభ్యులు మరియు టిటిడి అధికారులకు మరొక్కసారి ఎమ్మెల్యే కృతజ్జతులు తెలిపారు.