అప్కాస్ ను రద్దు చేసి కార్మికుల కడుపు కొట్టద్దు – వై ఎస్ ఆర్ టి యూ సి జోనల్ ఇంచార్జి రాజారెడ్డి డిమాండ్

మన న్యూస్ :తిరుపతి :– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఔట్ సోర్సింగ్ కార్మికుల కోసం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ (అప్కాస్ ) ను రద్దు చేయాలనీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు యోచిస్తున్నాడని, ఆ ఆలోచన విరమించుకోవాలని వై ఎస్ ఆర్ టి యు సి జోనల్ ఇంచార్జి నారపరెడ్డి రాజారెడ్డి అన్నారు. సోమవారం తిరుపతి లో సప్తగిరి నగర్ లో వై ఎస్ ఆర్ టి యు సి నగర ముఖ్యల సమావేశం నగర అధ్యక్షులు ఎస్. రాజా* ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశం లో ముఖ్య అతిథి గా పాల్గొన్న నార పరెడ్డి రాజారెడ్డి మాట్లాడుతూ గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ప్రయివేట్ ఏజెన్సీల ద్వారా వివిధ రంగాలల్లో ఔట్ సోర్సింగ్ కార్మికులు పెట్టి వారికీ ఇచ్చే వేతనంలో మధ్య వర్థులు కమిషన్ తీసుకొనే వారని దాని వలన కష్ట పడే కార్మికులకు అన్యాయం జరిగేదని దానిని ప్రతి పక్షం లో ఉన్నపుడు చేసిన పాదయాత్ర సందర్బంగా జగన్ మోహన్ రెడ్డి దృష్టిలో కి కార్మికులు తీసుకోని వస్తే, అధికారం లోనికి వచ్చిన వెంటనే జగన్ మోహన్ రెడ్డి ఏజెన్సీ వ్యవస్థ ను రద్దు చేసి అప్కాస్ ను తీసుకోని వచ్చి కార్మికులు తన కష్టపడిన జీతం నుండి కమిషన్ ఇచ్చేది రద్దు కాబడి పూర్తి జీతం వస్తే సంతోషం వ్యక్తం చేసారని అన్నారు. మరలా చంద్రబాబు అధికారం లోనికి వచ్చిన వెంటనే అప్కాస్ ను రద్దు చేస్తామని ప్రకటించడం కార్మికులకమోసం చేయడమేనని అన్నారు. వైయస్సార్ టి యు సి రాష్ట్ర కార్యదర్శి ఈ తిరుమలరెడ్డి మాట్లాడుతూ టీటీడీ లో పనిచేసే ఔట్ సోర్సింగ్ కార్మికుల నందరిని లక్ష్మి శ్రీనివాస కార్పొరేషన్ లో చేర్చాలని వారికీ జీతం 18 వేలు పెంచాలని అన్నారు. ఆప్కాస్ ను రద్దు చేస్తే లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పునరాలోచన చేసి ఆప్కాస్ ను యధావిధిగా కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమం జిల్లా కార్యదర్శి షేక్ మహమ్మద్ రఫీ, ఏ. యుగంధర్, గురుసాయి, నితిన్, జగదీష్, చక్రి, దయసాగర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..