

ఉదయగిరి(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):
భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నెల్లూరు జిల్లా మాజీ ఉపాధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి నాయుడు సోమవారం ఒక ప్రకటనలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కష్టాలు, కన్నీళ్లుతో కాలం గడిపిన రైతులను ఎన్డీయే ప్రభుత్వం ఆదుకుంటోంది. తెలియజేశారు.ప్రధాన మంత్రివర్యులు నరేంద్ర మోడీ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వం విత్తనాల పంపిణీ నుంచి పనిముట్లు వరకు పంపిణీ చేస్తూ వ్యవసాయంలో సాయంగా ఉంటోందని ఆయన తెలియజేశారు.ఇప్పుడు అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం ద్వారా పెట్టుబడి సాయం కూడా అందిస్తోంది.రైతులకు ఉపయయోగపడే డ్రోన్లు, ఇతర వ్యవసాయ పనిముట్ల సబ్సిడీ రేట్లతో రైతు సోదరులకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం,వ్యవసాయ రంగంలో యాంత్రికరణ తీసుకువచ్చి రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వానికి అండగా నిలుద్దామని,మేకపాటి మాల్యాద్రి నాయుడు తెలియజేశారు.