గూడూరు, మన న్యూస్ :- చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరు వారి ఆధ్వర్యంలో జయంపులో ఉచిత కంటి వైద్య శిబిరం పేద ప్రజలకు వరం జయంపులో ఉచిత కంటి వైద్య శిబిరం కు విశేష స్పందన పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యం లో మంగళవారo
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం వారి సహకారంతో జయంపు లోని పాత హాస్టల్ బిల్డింగ్ దగ్గర సచివాలయం ఆవరణలో లో ఏర్పా టు చేశామని మేనేజింగ్ ట్రస్టీ చాగణం గౌరిశంకర్, సీఈవో సీతారామ నాయుడు మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలకు సీనియర్ కంటి వైద్య నిపుణులైన అనుభవం గల స్పెషలిస్ట్ డాక్టర్ మేఘన మరియు వారి బృందం ఆధ్వర్యంలో 185 మంది కి పరీక్షలను ఉచితముగా నిర్వహంచి 90 మంది కి ఉచితముగా మందులు పంపిణీ, 45 రోగులకు ఉచిత కంటి అద్దాలు, 50 మంది కి ఉచితంగా ఆపరేషన్ లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ AOకృష్ణ గల్లా,
అరవింద్ నేత్రలయ సిబ్బంది జీవన్ , తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *