మన ధ్యాస,నిజాంసాగర్ (జుక్కల్): మొహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో నర్సరీ సమీపంలో ఏర్పాటు చేసిన బోర్‌వెల్ రీచార్జ్ స్ట్రక్చర్ వద్ద శుక్రవారం అధికారులు ముగ్గు వేసి నీటి సంరక్షణ, భూగర్భ జలాల పరిరక్షణపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.అనంతరం హసన్‌పల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను ఎంపీడీవో అనిత పరిశీలించారు.ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని తెలుసుకుని,నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు, లబ్ధిదారులకు సూచించారు.ఈ సందర్భంగా ఎంపిడివో మాట్లాడుతూ..వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకేలా చేసే బోర్‌వెల్ రీచార్జ్ స్ట్రక్చర్‌లను ప్రతి ఒక్కరూ సంరక్షించాలని, వాటి ద్వారా భూగర్భ జలమట్టం పెరిగి బోర్‌వెల్‌లలో నీటి లభ్యత మెరుగుపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోయని హరిన్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి శిరిష, ఉప సర్పంచ్ గంగారాం,ఫీల్డ్ అసిస్టెంట్ బాలరాజు, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నిఖిల్‌ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *