

వెదురుకుప్పం,మన న్యూస్, జూలై 26: వెదురుకుప్ప మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జనసేన – బీజేపీ నేతలు మండల తహసిల్దార్ కార్యాలయంలో అధికారిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ డిమాండ్ వెదురుకుప్ప మండలంలో ప్రజల అభిప్రాయంగా నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బోడి రెడ్డి అశోక్ రెడ్డి, జనసేన అసెంబ్లీ భూత్ కన్వీనర్ యతీష్ రెడ్డి, జనసేన మండల ఉపాధ్యక్షులు, నాయకులు చందు, చిరంజీవి, మునిరత్నం, అనిల్, శేఖర్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కామసాని చెంగా రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పాములు శేషాద్రి కుమార్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి తగిరు గోపి, దళిత మోర్చా అధ్యక్షులు ప్రకాష్, మండల ఉపాధ్యక్షులు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల అభిప్రాయం స్పష్టంగా ఇదే: వెదురుకుప్ప మండల ప్రజలకు తిరుపతి జిల్లాతో భౌగోళిక, సామాజిక, పరిపాలనా సంబంధాలు బలంగా ఉండటంతో – సేవల సౌలభ్యం, భద్రత, మరియు అభివృద్ధి దృష్ట్యా ఈ మార్పు జరగాలనే కోరుతున్నారు.నాయకులు మాట్లాడుతూ – “ఇది కేవలం రాజకీయ డిమాండ్ కాదని, నిజమైన ప్రజా ఆకాంక్షను ప్రతిబింబించే అంశం. ప్రభుత్వాధికారులు దీనిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము” అని తెలిపారు.