

ఫోక్సో చట్టం క్రింద మోసం చేసిన వ్యక్తిపై బుధవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం రామారెడ్డి గ్రామానికి చెందిన మార్కంటి రాజకుమార్ 30 సంవత్సరాల యువకుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను సంవత్సర కాలంగా ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి, శరీరకంగా వాడుకొని, ఇప్పుడు సంబంధం లేదని, పెళ్లి చేసుకోనని మోసగించాడని బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. సిఐ రామన్ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.