

మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గుట్ట మల్లారం నందు అశ్వాపురం మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన గోడపర్తి వంశీ నూతనంగా నిర్మించబడిన ఆర్ డి మోటార్స్ కార్ మెకానిక్ షెడ్ నూతన ప్రారంభోత్సవానికి పినపాక ఎమ్మెల్యే పాయం ముఖ్యఅతిథిగా విచ్చేసి కార్ మెకానిక్ షెడ్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొని కార్ మెకానిక్ షెడ్ లో నూతన లిఫ్ట్ మిషనరీ ని స్విచ్ బటన్ ఆన్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ను వంశీ శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే పాయం వంశీ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మణుగూరు మండల టౌన్ ప్రెసిడెంట్ శివ సైదులు, అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య, మణుగూరు, అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.