

మన న్యూస్ సాలూరు జూలై 18 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో కూటమి ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తూ రాజకీయ్య కక్ష సాధింపులకు పాల్పడుతూ ఉద్యోగులను వేధింపులకు గురిచేయడం మంచి సాంప్రదాయం కాదని మాజీ డిప్యూటీ సీఎం పి. రాజన్న దొర ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం స్థానిక మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ, వివిధ శాఖలలో పెద్ద స్థాయి నుండి క్రిందస్థాయి వరకు ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులపై వేధింపులకు గురు చేస్తున్నారని మాజీ మంత్రి పి. రాజన్న దొర ఆరోపించారు. ఇటీవల కాలంలోనే నియోజకవర్గంలోని ఉపాధి హామీ, పంచాయతీరాజ్, పోలీస్ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ లోని పనిచేస్తున్న ఉద్యోగులపై సరైన ఆధారాలు లేకుండా వివిధ కారణాలు చూపుతూ ఉద్యోగాల నుండి సస్పెండ్ చేస్తూ, వారి పొట్ట కొట్టే చర్యలకు పాల్పడటం చాలా బాధాకరమని అన్నారు. అదేవిధంగా తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశానని ఎటువంటి సందర్భంలో కూడా ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని, ఈ విధంగా స్థానిక మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఇటువంటి వ్యక్తికి గిరిజన, శ్రీ శిశు సంక్షేమ శాఖతోపాటు ఉద్యోగులను తొలగింపు శాఖాను కూడా ఏర్పాటు చేసి ఆ శాఖను అదనంగా మంత్రికి కేటాయించాలని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబును అభ్యర్థిస్తున్నానని ఆయన అన్నారు.