

మన న్యూస్,తిరుపతి:– ఆంధ్రప్రదేశ్ గ్రాప్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరుపతిలోని గిరిజన భవన్ ఇండోర్ హాల్, బైరాగిపట్టె వద్ద జూలై 12, 13 తేదీలలో జరిగిన 5వ రాష్ట్ర స్థాయి గ్రాప్లింగ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్ – 2025 పోటీలు విజయవంతంగా ముగిశాయి.ఈ పోటీల ముగింపు కార్యక్రమం వేడుకగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏ.పి. క్రీడా భారతీ అధ్యక్షులు ఒలింపియన్ ఎం.వి. మణిక్యలూ,విశ్వం గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ అకడమిక్ డైరెక్టర్ ఎన్. విశ్వచందన్ రెడ్డి,ఆంధ్రప్రదేశ్ బాల్-బాడ్మింటన్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకటరావు ఆంధ్రప్రదేశ్ రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై. వి. శివ కుమార్,రాష్ట్ర గ్రాప్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డి. సాయి సుమతి,ఆంధ్రప్రదేశ్ గ్రాప్లింగ్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఏ.జి.రత్న రాణి,ఆంధ్రప్రదేశ్ గ్రాప్లింగ్ అసోసియేషన్ ఎన్. శ్యామల,ఆంధ్రప్రదేశ్ ఫెన్సింగ్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి మురళి కృష్ణ పాల్గొనట్లు ఆంధ్రా ప్రదేశ్ స్పోర్ట్స్ క్రీడా భారతీ జాయింట్ సెక్రటరీ సురేంద్ర రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు మెడల్స్, ప్రశంసాపత్రాలు, ట్రోఫీ లు అందజేయడంతోపాటు వారి ప్రతిభను ప్రశంసించారు. ఈ పోటీలు యువతలో క్రీడాపై ఆసక్తిని పెంపొందించడంలో మైలురాయిగా నిలుస్తాయని ముఖ్య అతిథులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన గ్రాప్లింగ్ అసోసియేషన్‌కు ప్రతి ఒక్కరూ అభినందనలు తెలిపారు.