

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జవహర్ నవోదయ విద్యాలయ ంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశం కోరే గ్రామీణ ప్రాంతాల విద్యార్థిని విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తు న్నట్లు నిజాంసాగర్ నవోదయ విద్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల పరిధిలోని అన్ని మండలాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో విద్యా భ్యాసం చేస్తున్న విద్యార్థిని విద్యార్థులు నవోదయ ప్రవేశ పరీక్షకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ రాంబాబు తెలిపారు. ఉమ్మడి జిల్లా వాసులు ఈ ప్రవేశ పరీక్షకు అర్హులని తెలిపారు. ఉమ్మడి జిల్లా వాసులు ఈ ప్రవేశ పరీక్షకు అర్హులని తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొం దిన పాఠశాలలో రెండవ తరగతి, నాలుగో తరగతిలో పూర్తి విద్యాభ్యాసం చదివి 5వ తరగతిలో విద్యాభ్యాసం చేస్తున్న వారు అర్హులని తెలిపారు. 01.05.2015, మధ్య 31.07.2016 వారు ఉండాలన్నారు. 75 శాతం సీట్లు గ్రామీణ ప్రాంతాల అభ్యర్థుల ద్వారా భర్తీ చేయబడతాయని ప్రభుత్వ నబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ దివ్యాంగ అభ్యర్థుల కోసం రిజర్వే షన్ బాలికల విద్యార్థుల కోసం 1/3 వంతున రిజర్వేషన్ చేయబడదని వివరించారు. నవోదయ ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో అప్లయ్ చేసుకునేం దుకు 29.07.2025 చివరి తేది అని తెలిపారు.