

(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండలం ధర్మవరం శ్రీ ప్రతిభ విద్యాలయలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.శ్రీ ప్రతిభ విద్యాలయ అధినేత దాసం శేషారావు ఆదేశాలతో ప్రధానోపాధ్యాయులు దాకే సత్యనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారని, సమానత్వం,సామాజిక న్యాయం మరియు వ్యక్తిగత హక్కుల సూత్రాలు రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయని తెలియజేసి,విద్యార్థిని విద్యార్థులతో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించి, రాజ్యాంగ వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.