రెండుమూడేళ్లలో జుక్కల్ రూపురేఖలు మారుస్తా.ఆర్అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మన న్యూస్,నిజాంసాగర్( జుక్కల్ ) జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటున్నానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క సహకారంతో రెండుమూడేళ్లలో జుక్కల్ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. సోమవారం ఆయన నియోజకవర్గంలో పర్యటించారు.నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావు పల్లి చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జుక్కల్ మండలం కేంరాజ్ కల్లాలి వద్ద నాందేడ్ – సంగారెడ్డి జాతీయ రహదారి పక్కన మంత్రి మొక్కలు నాటి వన మహోత్సవానికి శ్రీకారం చుట్టారు.పిట్లం,బిచ్కుంద మండలాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు,శంకు స్థాపనల్లో పాల్గొన్నారు. బిచ్కుంద -డోంగ్లీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం బిచ్కుందలోని బండాయప్ప ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పదేళ్ల పాటు అధికారం అనుభవించిన ఈ ప్రాంత మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రస్తుత ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉత్సాహంగా పనిచేస్తున్నారన్నారు.బిచ్కుం
హైలెవల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి,ఎంపీ షెట్కార్, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు
కుర్లా వరకు రోడ్డు నిర్మాణానికి రూ. 13.2 కోట్లు మంజూరు చేశామన్నారు.శాంతాపూర్ నుంచి దగ్గి వరకు రోడ్డుకు రూ. 20 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు.మేనూర్ నుంచి డోంగ్లీ వరకు రోడ్డుకు రూ. 7.5 కోట్లు.అన్నాసాగర్ నుంచి జుక్కల్ రోడ్డుకు రూ.10 కోట్లు, జుక్కల్ నుంచి మద్నూర్ వరకు రూ. 10 కోట్లు మంజూరు చేస్తు న్నట్లు ప్రకటించారు.బిచ్కుంద, పిట్లం, జుక్కల్, డోంగ్లీ మండలాల్లో 6 విద్యుత్ సబ్ స్టేషన్లను మం జూరు చేయిస్తానన్నారు. బిచ్కుంద, పిట్లం మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేయిస్తానన్నారు. త్వరలోనే జుక్కల్ ముఖ్యమంత్రిని తీసుకువస్తానన్నారు.
గత ప్రభుత్వం అన్యాయం చేసింది..
గత ప్రభుత్వం జుక్కల్ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా అన్యాయం చేసిందని జహీరా బాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఆరోపించారు. నియోజకవర్గానికి అవసరమైన రోడ్లు,ప్రాజెక్టులు, సబ్ స్టేషన్లు మంజూరు చేయాలని మంత్రిని కోరారు.లెండి ప్రాజెక్టుతోపాటు నాగమడుగు ఎత్తిపోతల పథకాలకు నిధులు కేటాయించి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే సంజీవు రెడ్డి, సెట్విన్
కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్రెడ్డి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర, సబ్ కలెక్టర్ కిర ణ్మయి,జాయింట్ కలెక్టర్ విక్టర్, డీసీసీ అధ్య క్షుడు కైలాస్ శ్రీనివాస్రావు, కాంగ్రెస్ నాయకులు విఠల్రెడ్డి, మనోజ్ పటేల్, మల్లికా ర్జున్, భాస్కర్రెడ్డి, రవీందర్రెడ్డి, రమేశ్ దేశా య్, మల్లికార్జునప్ప షెట్కార్, వెంకట్రెడ్డి, నాగ్ నాథ్ పటేల్, నాగ్నాథ్, షేక్ అజీం లాలా, గం గాధర్, రవి పటేల్, సాహిల్ షెట్కార్ తదిత రులు పాల్గొన్నారు.

  • Related Posts

    లంకల గ్రామాన్ని సందడిగా మార్చిన చిన్న పీర్ల ఉత్సవాలు

    నారాయణపేట జిల్లా మన న్యూస్ :- నర్వ మండలంలోని లంకల గ్రామంలో 10 రోజులపాటు జరుపుకునే మొహర్రం (చిన్న పీర్ల) మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.కులమతాలకు అతీతంగా జరిగే ఈ వేడుకలు గ్రామాన్ని పండుగ వాతావరణంలో ముంచెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లాలతోపాటు తెలుగు రాష్ట్రాలు,…

    దత్తాత్రేయ దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.

    మన న్యూస్, నారాయణ పేట జిల్లా : పరిధిలోని మక్తల్ మండలం కర్ని గ్రామంలో గురు పౌర్ణమి వేడుకలను శ్రీ మారుతీ దత్తాత్రేయ దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు బ్రహ్మచారి అయినటువంటి గురువు స్వామివారిని శాలువా పూలమాలతో సత్కరించి అనంతరం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నా ప్రాణం ఉన్నంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా… కటిక పల్లి సర్పంచ్ మార్కొండయ్య

    నా ప్రాణం ఉన్నంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా… కటిక పల్లి సర్పంచ్ మార్కొండయ్య

    పిల్లల బంగారు భవిష్యత్తు గా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులు తల్లిదండ్రులదే… ప్రధానోపాధ్యాయులు హిమాచలపతి

    పిల్లల బంగారు భవిష్యత్తు గా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులు తల్లిదండ్రులదే… ప్రధానోపాధ్యాయులు హిమాచలపతి

    సాలూరులో సి పి ఎం పార్టీ మండల కమిటీలు – సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు

    సాలూరులో సి పి ఎం పార్టీ మండల కమిటీలు – సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి మీ కలసిన డాక్టర్ పసుపులేటి

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి మీ కలసిన డాక్టర్ పసుపులేటి

    జిల్లా కలెక్టర్ ను కలసిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్..

    జిల్లా కలెక్టర్ ను కలసిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్..

    108, 102, 1962 అంబులెన్సుల తనిఖీ – సేవలపై దృష్టి – ప్రథమ చికిత్సలో లోపాలుంటే కఠిన చర్యలు,హెచ్చరికలు

    108, 102, 1962 అంబులెన్సుల తనిఖీ – సేవలపై దృష్టి – ప్రథమ చికిత్సలో లోపాలుంటే కఠిన చర్యలు,హెచ్చరికలు