జిల్లా సమగ్రాభివృద్ధికి పటిష్ట చర్యలు. మంత్రి

మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) జిల్లా సమగ్రాభివృద్ధికి పటిష్టచర్యలు తీసుకుంటున్నామని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.సోమవారం జుక్కల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ లైన్ సమస్యలు, సాగు నీటి ప్రాజెక్టులు, వైద్య ఆరోగ్య సేవలు,వ్యవసాయం, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, మిషన్ భగీరథ,అటవీ భూముల ఆక్రమణ,మహిళా సంఘాలకు రుణాలు వంటి అంశాలపై సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా అదనపు సబ్ స్టేషన్లు నిర్మించాలన్నారు.నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ కాల్వల నిర్మాణ పనులు,అవసరమైన భూ సేకరణ పనుల పరిపాలన అనుమతులు మంజూరు చేయాలన్నారు.సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తి పోతల పథకాలపై నివేదిక అందించాలని ఆదేశించారు. పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి అవసరమైన ప్రతిపాద నలను ఈనెల 9 నాటికి అందిస్తే తదుపరి క్యాబినెట్ సమావేశంలో ఆమోదించేలా చూస్తా నన్నారు.జుక్కల్ నియోజకవర్గంలో వంద పడ కల ఆస్పత్రి, ట్రామా కేర్సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిం చారు.డీఎంఎఫ్లై నిధులను ఆస్పత్రిలో అవస రమైన వైద్య పరికరాల కొనుగోలు,పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పనకు వినియోగిం చాలని కలెక్టర్ కు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కార్,జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతా రావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి,తదితరులు ఉన్నారు.

  • Related Posts

    ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.

    రాయదుర్గం, మన న్యూస్ : నియోజకవర్గంలోని కూటమి సుపరిపాలన తొలి అడుగులో భాగంగా, కనేకల్ మండలం ఎర్రగుంట గ్రామంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని యంగ్ డైనమిక్ లీడర్ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్, కాలువ శ్రీనివాసులు తో కలసి ప్రారంభించారు…

    జిల్లా కలెక్టర్ ను కలసిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్..

    మన న్యూస్,తిరుపతి :జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ను రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ శుక్రవారం కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ను డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కలంకారి శాలువ తో ఘనంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    టి బి ముక్త భారత్ కి ప్రతి ఒక్కరు సహకరించాలి.అనుమానం రాగానే వైద్య సేవలు పొందాలి.ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యాధికారి ధీరేంద్ర పిలుపు

    టి బి ముక్త భారత్ కి ప్రతి ఒక్కరు సహకరించాలి.అనుమానం రాగానే వైద్య సేవలు పొందాలి.ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యాధికారి ధీరేంద్ర పిలుపు

    ఘనంగా కొండేపి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తల సమావేశం

    ఘనంగా కొండేపి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తల సమావేశం

    మీ ప్రాణం మీ భద్రత .ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి సురక్షిత ప్రయాణం చేయాలి .ఎస్సై నాగమల్లేశ్వర రావు పిలుపు.

    మీ ప్రాణం మీ భద్రత .ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి సురక్షిత ప్రయాణం చేయాలి .ఎస్సై నాగమల్లేశ్వర రావు పిలుపు.

    కూటమి పాలనలో అర్హులైన వారందరికీ సూపర్ సిక్స్ పథకాలు…

    కూటమి పాలనలో  అర్హులైన వారందరికీ సూపర్ సిక్స్ పథకాలు…

    ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.

    ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.

    మంత్రి కేశవ -కాలువ అభివృద్ధి పనుల పరిశీలన.

    మంత్రి కేశవ -కాలువ అభివృద్ధి పనుల పరిశీలన.