

మన న్యూస్ :తిరుపతి :– తెలుగుదేశం కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల ప్రభుత్వమని రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ చైర్మన్ . మన్నూరు సుగుణమ్మ తెలిపారు. శనివారం ముత్యాల రెడ్డి పల్లి ఉల్లి పట్టెడలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం సుగుణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను కరపత్రాల రూపంలో ఇంటింటికి తీసుకెళ్లి ప్రజలకు వివరించారు. ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో పార్టీల కేతహితంగా అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందుతాయి అన్నారు. భవిష్యత్తులో మరిన్ని కొత్త సంక్షేమ పథకాలను ప్రజలకు అందించినట్లు చెప్పారు. రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు అర్హులైన వారందరికీ త్వరలో ఇల్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, క్లస్టర్ ఇంచార్జ్ సూరా సుధాకర్ రెడ్డి, టిడిపి నగర అధ్యక్షులు వట్టికుంట చినబాబు, టిడిపి తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి మునిశేఖర్ రాయల్, కొట్టే హేమంత్ రాయల్, గంగులయ్య వెంకటేష్ యాదవ్ కొండారెడ్డి రమేష్ ప్రవీణ్ మస్తానమ్మ పద్మ తరుణ్ తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు.