

మన న్యూస్,తిరుపతి :– తిరుమల శ్రీవారి అన్న ప్రసాదాలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. శనివారం డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ , కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. అనంతరం వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రానికి వెళ్లి అన్న ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ అన్న ప్రసాద్ కేంద్రంలో ఎంతో పరిశుభ్రంగా అక్కడున్న సిబ్బంది కూడా భక్తులకు ప్రేమపూర్వకంగా అడిగడిగి వడ్డించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. శ్రీవారి సేవలో ఉన్న కొంతమంది సేవకులతో ఆయన మాట్లాడుతూ తిరుమలలో సేవ చేయడం శ్రీవారికి సేవ చేసినట్లేనని, ఎంతో ఆత్మ సంతృప్తిని ఇస్తుందన్నారు.