ఘనంగా స్వర్గీయ కొర్రపాటి రాములమ్మ జయంతి వేడుకలు…. నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ ..

గూడూరు ,మన న్యూస్ :- రవాణా శాఖ జిల్లా అధికారి కొర్రపాటి మురళీ మోహన్, కొర్రపాటి మునీంద్ర ప్రసాద్ ల మాతృమూర్తి కొర్రపాటి రాములమ్మ జయంతి వేడుకలు. మంగళవారం గూడూరులోని నరసింగరావు పేటలో ఘనంగా నిర్వహించారు. వారి కుటుంబ అభిమాని,బీజేపి యువమోర్చ పట్టణ అధ్యక్షులు చీకోలు శివకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి బిజీపీ సీనియర్ నాయకులు, మాజీ పట్టణ అధ్యక్షులు ఆరికట్ల బాలకృష్ణమ నాయుడు, అధ్యాపకులు బొమ్మిడి రామ్మోహన్ లు ముఖ్య అతిధులుగా విచ్చేయగా ముందుగా స్వర్గీయ కొర్రపాటి రాములమ్మ గారికి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి మహిళలకు స్వీట్లు, పండ్లు పంచిపెట్టారు.ముఖ్య అతిధులు బాలకృష్ణమ నాయుడు, బొమ్మిడి రామ్మోహన్ ల చేతుల మీదుగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు బాలకృష్ణమ నాయుడు మాట్లాడుతూ
కొర్రపాటి మురళీ మోహన్, కొర్రపాటి మునీంద్ర ప్రసాద్ లు తమ మాతృమూర్తి కొర్రపాటి రాములమ్మ జ్ఞాపకార్ధం విరివిగా పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం ఆదర్శరనీయం అన్నారు.కార్యక్రమ నిర్వాహకుడు శివ కుమార్ ను అభినందించారు. ఈ కార్యక్రమం లో పి. చిరంజీవి,టి శ్రీనివాసులు, కే మధుసూదన్,పద్మ,పోలమ్మ,చెన్నమ్మ. షేక్ మస్తానమ్మ, పవన్, మస్తానమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

7 వ రోజు కు చేరిన సాలూరు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె…

మన న్యూస్, సాలూరు జూలై 1:- పార్వతిపురం మన్యం జిల్లా, సాలూరు మున్సిపాలిటీ పరిధి లో ఇంజనీరింగ్ కార్మికులు 7వ రోజు సమ్మె కొనసాగుతుంది. కానీ మా యొక్క సమస్యలపై సమ్మెపై ఇంతవరకు ప్రభుత్వము గాని మున్సిపల్ అధికారులు గానీ ఇక్కడ…

13మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

మన న్యూస్ సాలూరు జూలై 1:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐ అప్పలనాయుడు స్థానిక విలేకరుల అందించిన సమాచారం మేరకు మంగళవారం పట్టణంలోని ఎరుకల వీధిలో దాసరి సన్యాసిరావు ఇంటి వెనుక…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

7 వ రోజు కు చేరిన సాలూరు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె…

7 వ రోజు కు చేరిన సాలూరు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె…

13మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

13మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

120 సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ సిబ్బంది,

120 సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ సిబ్బంది,

విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం..

విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం..

ఘనంగా నంబూరి రవి జన్మదిన వేడుకలు

ఘనంగా నంబూరి రవి జన్మదిన వేడుకలు