గూడూరు ,మన న్యూస్ :- రవాణా శాఖ జిల్లా అధికారి కొర్రపాటి మురళీ మోహన్, కొర్రపాటి మునీంద్ర ప్రసాద్ ల మాతృమూర్తి కొర్రపాటి రాములమ్మ జయంతి వేడుకలు. మంగళవారం గూడూరులోని నరసింగరావు పేటలో ఘనంగా నిర్వహించారు. వారి కుటుంబ అభిమాని,బీజేపి యువమోర్చ పట్టణ అధ్యక్షులు చీకోలు శివకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి బిజీపీ సీనియర్ నాయకులు, మాజీ పట్టణ అధ్యక్షులు ఆరికట్ల బాలకృష్ణమ నాయుడు, అధ్యాపకులు బొమ్మిడి రామ్మోహన్ లు ముఖ్య అతిధులుగా విచ్చేయగా ముందుగా స్వర్గీయ కొర్రపాటి రాములమ్మ గారికి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి మహిళలకు స్వీట్లు, పండ్లు పంచిపెట్టారు.ముఖ్య అతిధులు బాలకృష్ణమ నాయుడు, బొమ్మిడి రామ్మోహన్ ల చేతుల మీదుగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు బాలకృష్ణమ నాయుడు మాట్లాడుతూ
కొర్రపాటి మురళీ మోహన్, కొర్రపాటి మునీంద్ర ప్రసాద్ లు తమ మాతృమూర్తి కొర్రపాటి రాములమ్మ జ్ఞాపకార్ధం విరివిగా పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం ఆదర్శరనీయం అన్నారు.కార్యక్రమ నిర్వాహకుడు శివ కుమార్ ను అభినందించారు. ఈ కార్యక్రమం లో పి. చిరంజీవి,టి శ్రీనివాసులు, కే మధుసూదన్,పద్మ,పోలమ్మ,చెన్నమ్మ. షేక్ మస్తానమ్మ, పవన్, మస్తానమ్మ తదితరులు పాల్గొన్నారు.