

ఐరాల, నవంబర్ 26 : మన న్యూస్
చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, అగరంపల్లెలో ఈ రోజు మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూజలు చేసి ఘన నివాళులు అర్పించారు. దళిత నాయకులు మాట్లాడుతూ భారత దేశ రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం 1949 వ సంవత్సరం నవంబర్ 26, ప్రపంచ దేశాలన్నింటిలో అతి పెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగం, మన భారత దేశ రాజ్యాంగం ఆమోదించబడి, ప్రజల హక్కులకు, ప్రజా జీవనానికి దిశా – నిర్దేశకంగా నిలబడింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని మనకు అందించిన గొప్ప మహనీయులను స్మరిస్తూ, ప్రజలందరూ రాజ్యంగా స్ఫూర్తిని, విలువలను కాపాడుతూ, వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలని ఆశిస్తూమని దళిత నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు మురుగేష్, ఎస్. సుబ్రహ్మణ్యం ( కొత్తపల్లి బాబు), టిడిపి మహిళా అధ్యక్షురాలు తవణంపల్లి చిట్టెమ్మ, చిగరపల్లి గుణశేఖర్, చిరంజీవి, పుణ్య సముద్రం మహేష్, కొత్తపల్లి గుర్రప్ప, కొత్తపల్లి మునిస్వామి, తిరువనం పల్లి బాబు ఎంపీటీసీ, తెల్లగుండ్ల పల్లి శేఖర్, తిరణంపల్లి నటరాజ్, పుణ్య సముద్రం అమర్, ప్రదీప్, మద్ధిపట్లపల్లి నాగయ్య, తిరువణంపల్లి మురగేష్, చినకాంపల్లి పరదేశి, తదితరులు పాల్గొన్నారు.