• మార్కెట్ కమిటీ చైర్మన్ బద్ది మణి రామారావు లను సన్మానించిన జనసేన శ్రేణులు…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి (అపరూప్) తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి సుమారు 40 ఏళ్ల పైన తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ పార్టీలో అనేక పదవులు చేసి మెట్ట ప్రాంతంలోనే ప్రత్యేకత పేరుగాంచిన కుటుంబం బద్ది వారి కుటుంబం. వీరి సేవలను గుర్తించి దివంగత నేత స్వర్గీయ వరపుల రాజాని స్మరిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్యప్రభ చొరవతో ప్రత్తిపాడు నియోజకవర్గ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బద్ది మణి రామారావు కు పదవి ఇచ్చి గౌరవించడం జరిగింది. ఇటు వలె అంగరంగ వైభవంగా మండలంలో గల అన్నవరం ప్రైవేట్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, కాకినాడ జిల్లా టెలీకమ్యూనికేషన్స్ సలహమండలి సభ్యులు మేకల కృష్ణ,జనసేన జిల్లా కార్యదర్శి నల్లల రామకృష్ణ, విజయవాడ రైల్వే డివిజన్ వినియోగదారుల సలహమండలి సభ్యులు గోర్లి నాగేశ్వరరావు సంయుక్తంగా నెల్లిపూడి గ్రామంలో గల బద్ది రామారావు స్వగృహం లో బద్ది రామారావు దంపతులకు అభినందనలు తెలియజేస్తూ, ప్రత్తిపాడు మార్కెట్ యార్డు చైర్మన్ బద్ది మణి రామారావు దంపతులను ఘనంగా పూవ్వలమాలు వేసి, శాలువలతో
జ్ఞపికను అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా జనసేన కార్యదర్శి నల్లల రామకృష్ణ మాట్లాడుతూ బద్ది మణి రామారావు గత 40 సంవత్సరాల నుండి నిబద్ధతతో ప్రజలకు సేవ చేస్తున్నారని అందువల్లనే ఆయన సేవలను గుర్తించి మండల,నియోజకవర్గ స్దాయి పదువులు దక్కుతున్నాయని రామారావు దంపతుల సేవలను కొనియాడారు.నెల్లిపూడి గ్రామ ప్రజలు గర్వించదగిన వ్యక్తి బద్ది రామరావు అని నెల్లిపూడి అభివృద్ధి ప్రదాత బద్దిరామరావు అని నొక్కివక్కానించారు.అనంతరం బద్ది మణిరామారావు దంపతులు జిల్లా టెలీకమ్యూనికేషన్స్ సలహమండలి సభ్యులు మేకల కృష్ణ,జనసేన జిల్లా కార్యదర్శి నల్లల రామకృష్ణ, విజయవాడ రైల్వే డివిజన్ వినియోగదారుల సలహమండలి సభ్యులు గోర్లి నాగేశ్వరరావులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున రైతుల అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *