శంఖవరం మన న్యూస్ ప్రతినిధి (అపురూప్):- మెట్ట ప్రాంత రాజకీయ నాయకుడిగా చరిత్ర సృష్టించిన ఘనత దివంగత నేత స్వర్గీయ వరుకుల రాజాకే చెందుతుందని రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు ( శివ) కొనియాడారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు ( శివ) ఆధ్వర్యంలో దివంగత నేత స్వర్గీయ వరుపుల రాజా,శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ తనయుడు వరుపుల సాయి తర్సిత్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. తమ నాయకుల వారసుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని, రానున్న రోజుల్లో ప్రతిపాద నియోజకవర్గ పరిపాలనలో భాగస్వామిగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకరం చుట్టాలని పిలుపునిచ్చారు. తండ్రి ఆశయాలకు కృషి చేస్తూ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని వెన్న శివ దీవించారు. ఈ వేడుకల్లో మాజీ ఎంపీటీసీ సభ్యులు సాధన లక్ష్మీ బాబు, కంచిబోయిన శ్రీను, పెద్ద సంఖ్యలో టిడిపి శ్రేణులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *