

మన న్యూస్: పినపాక నియోజకవర్గం, ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు పాలకులు మారుతున్న గిరిపుత్రుల తలరాతలు మాత్రం మారడం లేదని, గిరిజన గ్రామాల ప్రజలు సరైన రహదారి సౌకర్యం లేక చెప్పుకోలేని కష్టాలతో మగ్గిపోతున్నారని, వారు కనీసఅవసరాలు తీర్చుకోవడం కోసం ఓ యుద్ధమే చేయాల్సి వస్తుందని, సామాజిక కార్యకర్త , లాయర్ కర్నే రవి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన అశ్వాపురం మండలంలోని ఆదివాసి గ్రామాలైన ఎలకల గూడెం, గొందిగూడెం గ్రామాలను సందర్శించి గిరిజన ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రవి విలేకరులతో మాట్లాడుతూ…మండల పరిధిలోని గొందుగూడెం తుమ్మలచెరువు గ్రామ పంచాయతీలలో గల లోతు వాగు, ఇసుక వాగుల బ్రిడ్జిలు నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోవడంతో దశాబ్దాల కాలంగా ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పేర్కొన్నారు.ఇసుక వాగు పైనా గత పాలకులు అతి ఉత్సాహంతో వంతెన నిర్మాణం చేపట్టారని కానీ , పనులను కాంట్రాక్టర్ మధ్యలోనే నిలిపివేశారని, ప్రస్తుతం పాలకులు బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయకుండా గిరిజన ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆయన ఆరోపించారు. ఇసుక వాగు వంతెనకు ఆరు కొట్ల యాభై లక్షల రూపాయలు నిధులు విడుదలైన బ్రిడ్జి నిర్మాణా
లను హడావుడిగా ప్రారంభించి ఎందుకు వదిలేశారో గిరిజన ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బ్రిడ్జి నిర్మాణాల పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే సందంగా ఉందని, ఫలితంగా 16 గిరిజన గ్రామాల ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో వర్షాకాలం వచ్చిందంటే సకాలంలో వైద్య సేవలు పొందలేని దుస్థితి నెలకొందన్నారు. గర్భిణీలు, వృద్ధుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయన్నారు. గిరిజన సంక్షేమం కోసం ఎంతో ఖర్చు చేస్తున్నామని, చెప్తు
న్నా పాలకుల మాటలు కేవలం కాగితాలకే పరిమితంఅవుతుందని, ఎద్దేవా చేశారు.కేవలం ఎన్నికల సమయంలో కనిపించే నాయకులకు గిరిజన ప్రజల కష్టాలు కన్నీళ్లు తుడిచే సమయం లేదా అని ప్రశ్నించారు.ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇసుక వాగు లోతు వాగు బ్రిడ్జి నిర్మాణాలను వెంటనే ప్రారంభించి, గిరిజన ప్రజల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు.గొంది గూడెం ఎలు కలగూడెం మనుబోతుల గూడెం, భీమవరం, కొత్తూరు,తుమ్మలచెరువు, వెంకటాపురం తదితర గ్రామాల ప్రజల సౌకర్యం కోసం వంతెన,రహదారి నిర్మాణ లఫై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని రవి విజ్ఞప్తి చేశారు.