యువత పోరు’ను విజయవంతం చేయాలి—ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి.

పోరుమామిళ్ల: జూన్ 21: మన న్యూస్: నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ ఈనెల 23వ తేదీన కడప కలెక్టరేట్‌ వద్ద నిర్వహించే ‘యువత పోరు’ ధర్నాను విజయవంతం చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పోరుమామిళ్ల పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరగబోయే ‘యువత పోరు’ పోస్టర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి యువజన విభాగం ఎంతో కీలకమని అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల గురించే ఆలోచిస్తుందని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలు మోసానికి గురవుతున్నారన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ఏడాది గడిచినా చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఏడాదిగా ఉద్యోగాల కల్పన లేకపోగా ఉన్న ఉద్యోగాలను కూడా తొలగిస్తున్న పరిస్థితి ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 23వ తేదీన కడప కలెక్టరేట్‌ ఎదుట యువజన విభాగం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో యువతను భాగస్వామ్యం చేసుకుని విజయవంతం చేయాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని అనంత మండిపడ్డారు. కేసులకు ఎవరూ భయపడొద్దని సూచించారు. ప్రజల పక్షాన పోరాట చేయాలని యువజన విభాగం నేతలకు సూచించారు.
ఎన్నికలకు ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, లేని పక్షంలో నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారన్నారు. ఏటా జనవరి 1వ తేదీనే జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని చెప్పినా ఆచరణకు నోచుకోలేదని తెలిపారు. ఏడాది గడిచినా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, ఒక్కరికీ నిరుద్యోగ భృతి అందకపోగా ఉన్న ఉద్యోగాలను కూడా పీకేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ హయాంలో 6800 టీచర్‌ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక నోటిఫికేషన్‌ రద్దు చేశారన్నారు. మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు, లోకేష్‌ తొలి సంతకాలు చేసినా ఇప్పటికీ పోస్టులు భర్తీ చేయలేదన్నారు. వైఎస్‌ జగన్‌ హయాంలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి 1.25 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎండీయూ ఆపరేటర్లు, ప్రభుత్వ మద్యం షాపుల్లో పని చేసే సూపర్‌వైజర్, సేల్స్‌మన్లను తొలగించి యువతను నిరుద్యోగులుగా మార్చారన్నారు.
వైఎస్‌ జగన్‌ హయాంలో సంక్షేమ పథకాలను అందిస్తే ముసలోడు కూడా బటన్‌ నొక్కుతాడు అని చంద్రబాబు అవహేళన చేశారు. ఈ రోజు అదే ముసలోడిని అడుగుతున్నాం. బటన్‌ సరిగ్గా నొక్కలేకపోతున్నారా? మా ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశాం. ఇప్పుడు తల్లికి వందనం అని పేరు మార్చారు. రాష్ట్రంలో 60 లక్షల మందికి పైగా లబ్ధిదారులుంటే కేవలం 30 లక్షల మందికి మాత్రమే తల్లికి వందనం అందించారు. వైఎస్‌ జగన్‌ అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టి తల్లులకు రూ.13 వేలు అందించారు. రూ.2 వేలను స్కూళ్ల అభివృద్ధికి కేటాయించి నాడు–నేడు ద్వారా అభివృద్ధి చేశారు. అప్పట్లో చంద్రబాబు, లోకేష్, కూటమి నేతలంతా అమ్మ ఒడిలో రూ.2 వేలు జగన్‌ కోత పెట్టాడని విమర్శించారు. ఆ డబ్బు జగన్‌ జేబులోకి వెళ్తోందని అన్నారు. అప్పట్లో మీరు తల్లికి వందనం కింద రూ.15 వేలు అందిస్తామని, కోతలుండవని హామీ ఇచ్చారు. కానీ నేడు జరుగుతోంది ఏంటి? రూ.15 వేలలో రూ.2 వేలు కోత పెట్టారు. అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పోరాటం చేస్తాం’’ చెప్పారు ఈనెల 23వ తేదీన యువజన విభాగం ఆధ్వర్యంలో కడప జిల్లా కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. యువజన విభాగం నాయకులు, కార్యకర్తలంతా ‘యువత పోరు’ను విజయవంతం చేయాలన్నారు. పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో యువ నాయకులు చిత్తా గిరి ప్రణీత్ రెడ్డి , జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు సాయి నారాయణ రెడ్డి, జిల్లా యువజన విభాగ కార్యవర్గ సభ్యుడు జగదీష్ రెడ్డి, మండల వాలంటరీ వింగ్ అధ్యక్షులు శివ, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు పొదిలి మస్తాన్ మనీ, జిల్లా విద్యార్థి విభాగం ఎగ్జిక్యూటివ్ నెంబర్ కే శివకుమార్, సెల్ పాయింట్ భాష, రసూల్, వెంకటేష్, ఆది బోయిన శ్రీకాంత్ యాదవ్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 2 views
    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 4 views
    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    • By RAHEEM
    • October 29, 2025
    • 3 views
    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

    • By RAHEEM
    • October 29, 2025
    • 4 views
    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

    దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

    • By RAHEEM
    • October 29, 2025
    • 3 views
    దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 8 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్