

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం: మండలంలోని చిన్నింపేట జీడి పిక్కల ఫ్యాక్టరీ అర్ధాంతరంగా మూసివేయడంతో రోడ్డున పడ్డ కార్మికులు గత తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న ధర్నాకు సిపిఎం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి పాకలపాటి సోమరాజు సోమవారం ధర్నా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్యాక్టరీ మూసి వేయడంతో సమీపాన 24 గ్రామాలకు చెందిన 409 మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. గత తొమ్మిది రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న ప్రభుత్వానికి సేమ్ కుట్టినట్టైనా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఫ్యాక్టరీని తెరిపించి కార్మికులకు పని కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా కార్మికులు ఉన్నారు.