

*పాదయాత్ర విజయవంతం అవ్వాలని చిన్న వ్యాపారస్తులు సంఘం ప్రత్యేక పూజలు*
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం:
చిన్న వ్యాపారస్తుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బంక రాజు ఏలేశ్వరం నుండి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సోమవారం పాదయాత్ర చేపట్టారు.ఈ సందర్భంగా బంక రాజు మీడియాతో మాట్లాడుతూ గతంలో ఏలేశ్వరంలో షాపులను అక్రమంగా రాత్రికి రాత్రే కూల్చివేసిన ఘటన చోటుచేసుకుందని,షాపులు మళ్లీ పునర్నిర్మాణం చేపడితే కాలినడకన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధానానికి వచ్చి మొక్కు తీర్చుకుంటానని అనుకున్నానని ఆయన అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దయవల్ల షాపులు మళ్ళీ పునర్నిర్మాణం చేపట్టడం జరిగిందని,60 కుటుంబాల్లో వెలుగు నింపిన సందర్భంగా పాదయాత్రగా వాడపల్లి వెళ్తున్నారని ఆయన అన్నారు.బంక రాజు చేపట్టిన పాదయాత్ర విజయవంతం అవ్వాలని బిజెపి నాయకులు పైల సుభాష్ చంద్రబోస్, గౌరవ అధ్యక్షుడు అలమండ నాగేంద్ర కుమార్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పాకలపాటి సోమరాజు,ఏలేశ్వరం చిన్న వ్యాపారస్తుల సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.