మన న్యూస్ గూడూరు : తిరుపతి జిల్లా, గూడూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగుల భవనము నందు ప్రాస్పరో స్కూల్ కరస్పాండెంట్ దశరథరామిరెడ్డి దాతృత్వంలో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేయడమైనది. జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు వేగూరు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రెడ్ సంస్థ లో గౌరవాధ్యక్షుడుగా ఉన్న నేను జే వి వి ద్వారా మా దివ్యాoగ సోదరులకు ప్రతినెల మూడవ ఆదివారం కూరగాయలు, గుడ్లను పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని ఈనాటి కార్యక్రమానికి దాతృత్వం వహించిన దశదరామిరెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేస్తూ దివ్యాంగ సోదరులందరూ చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మంచి జీవితం సాగించాలని మీరు చేసే వృత్తిలో మీకు అవసరమైతే జన విజ్ఞాన వేదిక ఎప్పుడూ మీకు అండగా నిలుస్తుందని మీరందరూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నానని తెలిపారు.. ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్రప్రసాద్, నాగరాజు, పురుషోత్తమరావు, సుబ్బారావు, ప్రభాకర్, ఇబ్రహీం, అశోక్, శ్రీనివాసులు, టీచర్ రాదయ్య, రజినీకాంత్, శ్రీనివాసాచారి, అరుణ్ , జానా సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *