మన న్యూస్ ,ఎస్ఆర్ పురం :-గంగాధర నెల్లూరు మండలం జైన్ జ్యూస్ ఫ్రెష్ కర్మగారంలో శుక్రవారం మామిడి రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ రమేష్ బాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రమేష్ బాబు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి చొరవతో యాజమాన్యంతో మాట్లాడి రైతుల సమస్యలను వెంటనే అమలపరిచినందుకు రైతుల పక్షాన పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు టోకెన్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతి ద్వారా కొనుగోలు చేయాలని చేశారు మామిడి రైతులకు కొత్తగా ప్రవేశపెట్టిన టోకెన్ విధానాన్ని రద్దుచేసి పాత పద్ధతిలో డైరెక్ట్గా ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ వద్ద సీరియల్ ప్రకారం అమ్ముకునే విధంగా కలెక్టర్ వారు చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు. రైతులందరూ ఆందోళన చెందకుండా సోమవారం నుండి ప్రతి ఒక్కరు తన మామిడి పంటను నేరుగా ఫ్యాక్టరీ వద్దకు తీసుకెళ్లి విక్రయించుకోవచ్చని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *