తల్లికి వందనం అమలు హర్షం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు

మన న్యూస్, ఎస్ఆర్ పురం:-తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థుల తల్లిదండ్రులు. గంగాధర నెల్లూరు మండలం నెల్లెపల్లి పంచాయతీ కొత్తూరు గ్రామానికి చెందిన సోనీ అనే మహిళలు తల్లికి వందనం అమలు చేసి తమ ఖాతాల్లో డబ్బులు జమ చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. తమకు ముగ్గురు పిల్లలు ఉన్నారని ముగ్గురు పిల్లలకు 39 వేల రూపాయలు అందాయని తమ పిల్లలను చదువుకొని కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అందుకు నిదర్శనం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడం అని అన్నారు. సూపరిపాలన అందించడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కే సాధ్యమని ఆయన సేవలను కొనియాడారు. జీడినెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *