మన న్యూస్, విడవలూరు:- పల్లె పండుగతో పల్లెల్లో వసతులు- ఏడాది పాలనలో అద్భుత విజయాలు.- సూపర్‌ 6 పథకాలు అమలు చేస్తున్నారు.- స్పౌజ్‌ పింఛన్లను త్వరలోనే అందించనున్నాం.- విడవలూరులో పల్లెపండుగలో ఎమ్మెల్యే ప్రశాంతమ్మ.పల్లెలను పట్టణాలుగా మార్చి.. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సహాయ సహకారాలతో కోవూరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. బుధవారం పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా విడవలూరు మండలకేంద్రంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రూ.1.20 కోట్లతో నిర్మించనున్న విడవలూరు – వావిళ్ళ, అన్నారెడ్డిపాలెం – వరిని రోడ్లకు ఆమె శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మాట్లాడుతూ.. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్‌ 6 పథకాలు అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నారని, త్వరలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పధకాలు అమలవుతాయన్నారు. అలాగే ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు చెప్పారు. ఈ నెల 12న కోవూరు నియోజకవర్గంలో స్పౌజ్‌ పింఛన్లు అందించనున్నట్లు పేర్కొన్నారు. కోవూరు నియోజకవర్గంలో నీటి వసతి లేదన్న మాట వినిపించకూడదని ఆమె స్పష్టం చేశారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని ఆమె పేర్కొన్నారు. కూటమి పాలనలో మన గ్రామాలను ఇలాగే అభివృద్ధి చేసుకుందామని ఆమె పిలుపునిచ్చారు. అభివృద్ధి క్రతువుతో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు ఏటూరు శ్రీహరిరెడ్డి, బెజవాడ వంశీరెడ్డి, అచ్యుత్‌ రెడ్డి, అడపాల శ్రీధర్‌రెడ్డి, చెముకుల చైతన్య, పాశం శ్రీహరి రెడ్డి, బెజవాడ గోవర్థన్‌రెడ్డి, సింహాద్రి అయ్యప్ప, సర్పంచి బండ్ల కవిత, కె. మధు, సంగు హరి, పెద్దల శేఖరయ్య, పైడిగాని నాగేశ్వరరావు, శ్రీహరి, బీజేపీ ఇన్‌ఛార్జి రాఘవేంద్రరావు, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *