

- మియాపూర్ చైతన్య లో ఘటన
- విద్యార్థి మృతికి గ్యాంగ్ వారే కారణం అంటున్న కుటుంబ సభ్యులు
- గత కొన్ని రోజులుగా చైతన్య సంస్థలో 8 మంది విధ్యార్థుల మృతి
Mana News :- శేరిలింగంపల్లి (నవంబర్ 23)మన న్యూస్ :- మియాపూర్ లోని చైతన్య కాలేజ్ లో మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది మియాపూర్ కల్వరి టెంపుల్ వద్ద ఉన్న శ్రీ చైతన్య బాయ్స్ జూనియర్ కాలేజ్ లో ఏంపీసీ మొదిటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కౌశిక్ రాఘవ (17) తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కాగా తల్లి తండ్రులు మాత్రం ఇది ఆత్మహత్య కాదు తమ కుమారుడి మృతికి గ్యాంగ్ వారే కారణం అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే గత కొద్ది రోజులుగా కాలేజ్ లో గ్యాంగ్ వార్లు నడుస్తున్నాయని గత రాత్రికూడా విద్యార్థుల మధ్య గొడవ జరిగినట్లుగా సమాచారం దీనికి కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇటీవల నగరంలోని చైతన్య సంస్థల్లో రోజురోజుకూ విదార్ధుల మరణాలు పెరిగిపోతున్నాయి మొన్న మాదాపూర్ నిన్న బాచుపల్లి నేడు మియాపూర్ లో ఇలా కొన్ని రోజుల వ్యవధిలో మొత్తం 8 మంది విద్యార్థులు మృతి చెందటం కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం అద్దం పడుతుంది అయితే పలు విద్యార్థి సంఘాలు కాలేజ్ వద్దకు చేరుకొని ధర్నాలు నిర్వహించారు మియాపూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
