

Mana News :- సాలూరు నవంబర్23( మన న్యూస్):= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో రేషన్ డిపోలకు బియ్యంతో పాటు ఇతర సరుకులన్నీ ఒకేసారి సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ శోభిక అధికారులకు ఆదేశించారు. శనివారం,సాలూరుతాసిల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్ని రేషన్ డిపోలకు సరుకులు చేర వేశారని, సి. ఎస్. డి టి,రంగారావు ప్రశ్నించారు. డిపోలుకు పంపించే సరుకులు వివరాలు తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు.