నెల్లూరు మైపాడు బీచ్ లో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం

మన న్యూస్, ఇందుకూరు పేట :- మైపాడు బీచ్ లో యోగాంధ్ర గ్రాండ్ సక్సెస్. – సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే సాధ్యం. – యోగాంధ్ర ద్వారా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సంకల్పం సాకారం చేద్దాం. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరు యోగ భాగం చేసుకోవాలని కోరారు కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె ఇంచార్జ్ కలెక్టర్ కార్తీక్ తో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు నందుకొని మంగళవారం ఉదయం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో 2000 మందికి పైగా పాల్గొన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మైపాడు సముద్ర తీరంలో నిర్వహించిన ఈ మెగా ఈవెంట్ లో ఆయుష్ మరియు యోగా మిత్ర మండలికి చెందిన యోగా గురువులు వేలాదిగా విచ్చేసి సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్న వారిచే యోగాసనాలు వేయించారు. కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ కలెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ….. ఆరోగ్యకర జీవన విధానం యోగ తోనే సాధ్యమన్నారు. నేటి నుండి ప్రారంభమయ్యే గ్రామ, వార్డు స్థాయిల యోగ శిక్షణ లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ…. సంపూర్ణ ఆరోగ్యానికి యోగ మాత్రమే సమాధానమన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలిపారు. వాకింగ్ చేయలేని వారు ఇంట్లోనే వుంటూ యోగ సాధన ద్వారా ఆరోగ్యం కాపాడు కోవచ్చని సూచించారు. యోగాంధ్ర ద్వారా చంద్రబాబు నాయుడు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సంకల్పం సాకారం చేయాలని ఆమె పిలుపు నిచ్చారు. యోగాంధ్ర లాంటి ఈవెంట్ల సందర్భాలలో మొక్కుబడిగా కాకుండా ప్రతి నిరంతర యోగ సాధన చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. జిల్లాలో 8 లక్షలకు పైగా యోగాంధ్ర కార్యక్రమంలో రిజిస్టర్ కావడం ప్రజలలో ఆరోగ్యం పట్ల పెరుగుతున్న అవగాహనకు నిదర్శనమన్నారు. యోగాంధ్ర లాంటి ప్రజాహిత కార్యక్రమాల గురించి సచివాలయాల పరిధిలో గ్రామ నాయకుల సమన్వయంతో ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ అనూష, జిల్లా పర్యాటక శాఖా అధికారి ఉషశ్రీ, టిడిపి సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, ఇందుకూరుపేట, బుచ్చి రూరల్, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి, బెజవాడ జగదీష్, గుత్తా శ్రీనివాసరావు, టిడిపి నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, బెజవాడ వంశీ కృష్ణారెడ్డి, జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు