మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
రాష్ట్ర ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థను రద్దుచేసి చౌక ధరల డిపోల వద్ద ప్రజా పంపిణీ వ్యవస్థ విధానాన్ని తీసికొని రావడంతో కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని బొదిరెడ్డి గోపి,మూది నారాయణస్వామి పేర్కొన్నారు.ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదేశానుసారం రేషన్ డిపోల వద్ద పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీని ప్రారంభించారు. అనంతరం స్థానిక నాయకులు,రెవెన్యూ అధికారులతో కలిసి గ్రామంలో వికలాంగులు,వృద్ధులకు నేరుగా వారి ఇంటి వద్ద నిత్యావసర సరుకుల పంపిణీ చేపట్టారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం తీసికొచ్చిన ఎండియు వ్యవస్థ ద్వారా అనేక అక్రమాలు జరిగాయన్నారు.రేషన్ డిపోల వద్ద అధికారుల పర్యవేక్షణలో 15 రోజుల పాటు ఎటువంటి అక్రమాలు లేకుండా రేషన్ పంపిణీ జరుగుతుందన్నారు.
రేషన్ డిపోల వద్ద నేటి నుండి 15 రోజులపాటు నిత్యావసర సరుకులు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు మూది నారాయణస్వామి, బొదిరెడ్డి గోపి, నగర పంచాయతీ 2 వ వైస్ చైర్మన్ ముసరపు బుజ్జి నాగేశ్వరరావు,ఘట్టం వెంకటరమణ, రెడ్డి రాజు, కొన్సిలర్లు పెండ్ర శ్రీను, కోణాల వెంకట రమణ, ఎండగుడి నాగబాబు, మామిడి శ్రీను, రెవిన్యూ, సివిల్ సప్లై శాఖల అధికారులు
ఎన్డీఏ కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *