

Mana News :- మనన్యూస్ తవణంపల్లె నవంబర్-21:- మండలంలోని తవణం పల్లె ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల టి. పుత్తూరు సచివాలయము నకు చెందిన పొన్నేడిపల్లె గ్రామమును జిల్లా మలేరియా అధికారి డాక్టర్ అనిల్ కుమార్ జిల్లా అదనపు మలేరియా అధికారి రామచంద్ర రెడ్డి, నారాయణ సూపెర్వైజర్ ఆకిస్మికము గా తనిఖీ చేసి గ్రామము లో ఎవరైనా జ్వర పీడితులు ఉన్నార అని అడిగి తెలుసుకొని సీజినల్ వ్యాధుల పట్ల గ్రామంలోని ప్రజలకు అందరికి అవగాహన కల్పించి డెంగీ జ్వరాలు, మలేరియా జ్వరాలు, చికెన్ గునియా జ్వరాలు, ఫైలేరియా జ్వరాల పట్ల గ్రామ ప్రజలకు అవగాహన కల్పించి ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకొవాలని తెలియజేస్తూ ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమం ను సక్రమంగా అమలు చేఇంచాలని వైద్య సిబ్బంది కి తెలియజేసారు. పై కార్యక్రమం లో మండల వైద్య అధికారి డాక్టర్ మోహన వేలు, సూపర్వైజర్లు శ్రీహరి, డి.రాజశేఖర్, ఆరోగ్య కార్య కర్తలు శ్రీనివాసులు, సుబ్రమణ్యం రెడ్డి, లావణ్య మరియు ఆశ కార్యకర్తలు పాల్గున్నారు.