

జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్
Mana News :- తిరుపతి, నవంబర్ 21,(మన న్యూస్ ) :- తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనాన్ని స్థానికులకు టిటిడి పాలకమండలి పునరుద్ధరించడటం హర్షనీయమని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. గురువారం ఉదయం జనసేన పార్టీ ఆధ్వర్యంలో అలిపిరి పాదాలమండపం వద్ద నూట పదహారు కొబ్బరి కాయలు కొట్టి శ్రీవారికి కృతజ్జతలు తెలిపారు. ఎన్నికల్లో గెలిస్తే స్థానికులకు నెలలో మొదటి మంగళవారం దర్శనాన్ని పునరుద్దరిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ చేసిన కృషి అభినందనీయమని ఆయన అన్నారు. స్థానికులకు దర్శన భాగ్యం కల్పించిన సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడులకు ప్రత్యేక ధన్యవాదాలు ఆయన పార్టీ తరుపున తెలిపారు.కాగా టిటిడిలో పని చేస్తున్న పారిశుద్ధ కార్మికులు, ఫారెస్ట్ కార్మికులతోపాటు మిగిలిన విభాగాల్లోని వారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మంచిరోజులు రానున్నాయని ఆయన చెప్పారు. ఐదేళ్ళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చారని జనసేన నగర అధ్యక్షులు రాజా రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇచ్చి మాట ప్రకారం స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం టిటిడి కల్పించిందని ఆయన తెలిపారు. స్థానికులకు దర్శనం పునరుద్దరించిన సిఎం చంద్రబాబు నాయుడు, టిటిడి పాలకమండలి ఛైర్మన్ బిఆర్ నాయుడులకు ఆయన కృతజ్జతలు తెలిపారు. తిరుమల పవిత్రను కాపాడే విధంగా టిటిడి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటాయని ఆయన చెప్పారు. స్థానికులకు దర్శనం కల్పించే విషయంలో టిటిడి బోర్డు తొలి సమావేశంలో తీసుకోవడంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తీసుకున్న చొరవే కారణమని ఆయన తెలిపారు. టిటిడి నిర్ణయాల పట్ల ప్రజల్లో మంచి స్పందన లభిస్తోందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వెంకటేశ్వర రావు, ఆర్కాట్ కృష్ణ ప్రసాద్, బాబ్జీ, అన్నా యువరాజ్ రెడ్డి, రాజేష్ ఆచ్చారి, మునస్వామి, సుధా, వినోద్ రాయల్, వూసా మాధవరావు, ఆకేపాటి సుభాషిణి, దుర్గా, లతా తదితరులు.
