ఎండియు వ్యవస్థ రద్దు చేయడంతో హర్షాతిరేకాలు

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్:
అన్ని వర్గాల వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు.రేషన్ డోర్ డెలివరీ వ్యానులను రద్దుచేసి రేషన్ డిపోలకు రేషన్ సరుకులు అమ్మే అవకాశం కల్పించినందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతిపాడు మండలంలోని రేషన్ డీలర్లు అందరూ ఎమ్మెల్యే సత్యప్రభను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపి చిరు సన్మానం చేసారు.ప్రతిపాడు మండలం పెద్ద శంకర్లపూడి టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి ఇంటింటికి రేషన్ సరఫరా చేసే వాహనాలను రద్దు చేయడం ద్వారా వారికి ఉపాధి కల్పించిన కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని రేషన్ డీలర్లు అన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ పేదవారికి రేషన్ సేవలు సక్రమంగా అందేలా సహకరించాలని డీలర్లను కోరారు.ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల అధ్యక్షులు మరియు యూనియన్ సభ్యులతోపాటు మండలంలో వివిధ గ్రామాల చెందిన రేషన్ డీలర్లు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *