మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలంలోని పలు గ్రామాలలో ఈనెల 24 న శుక్రవారంనాడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ ఏ.ఈ జి.సూర్యనారాయణ తెలిపారు.ఏలేశ్వరం సబ్ స్టేషన్ నందు మరమ్మత్తులు చేయు నిమిత్తం మండలంలోని లింగంపర్తి,భద్రవరం,కొండ తిమ్మాపురం,మొలగల మెట్ట,ఏలేశ్వరం,సి.రాయవరం, రమణయ్యపేట,మార్కండేయపురం, ఈ. ఎల్.పురం,కిమ్మూరు,జీ.వి.పాలెం, సారంపేటపాడు,మల్లయ్య పాకలు,పీ.జీ పాడు,అప్పన్నపాలెం తదితర గ్రామాలకు శుక్రవారం నాడు ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేయబడునని ప్రజలకు కలుగుతున్న అసౌకర్యానికి మన్నించి సహకరించగలరని ఏఈ కోరారు

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *