దళిత హక్కుల పోరాట సమితి తిరుపతి నగర నూతన అధ్యక్షులుగా జెట్టి జనార్ధన్ ప్రధాన కార్యదర్శిగా బొడ్డు నాగభూషణం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి చిన్నం కాళయ్య ప్రకటించారు. సోమవారం స్థానిక బైరాగి పట్టెడ లోని సిపిఐ కార్యాలయంలో దళిత హక్కుల పోరాట సమితి నగర ముఖ్యుల సమావేశం డాక్టర్ ఆర్ బలరాం అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో దళిత హక్కుల పోరాట సమితి ఏర్పడి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా తిరుపతి లో 20వ వార్షికోత్సవాలు నిర్వహించాలని తీర్మానించారు. నేడు దళితులపై జరుగుతున్న దాడులు దళితుల భూములు అన్యాక్రాంతం కావడం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సక్రమంగా అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. అనేక రకాల సమస్యలను చర్చించి కార్యచరణ రూపొందించడం జరిగింది. అనంతరం నూతన కమిటీ నీ ఎన్నుకున్నారు నగర గౌరవాధ్యక్షులుగా జల్లా విశ్వనాథ్
అధ్యక్షులుగా జెట్టి జనార్ధన్, ప్రధాన కార్యదర్శి గా బొడ్డు నాగభూషణం,కార్యనిర్వహణ కార్యదర్శులుగా టి కృష్ణ, పుట్టా వినోద్ కుమార్, ఉపాధ్యక్షులుగా ఆర్ ఈశ్వరయ్య, సి రత్నమ్మ, ఎం అవనాక్షి, సహాయ కార్యదర్శులు గా బి వెంకట రమణ, నాగరత్న, కోశాధికారిగా నాగరాజు లతో పాటు మరో 10 మంది కమిటీ సభ్యుల ను ఎన్నుకోవడం జరిగిందన్నారు . ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షా కార్యదర్శులు మాట్లాడుతూ దళితులకు ఏ సమస్య వచ్చినా వారి పక్షాన నిలబడి రాజీలేని పోరాటం చేస్తామని, మా పైన నమ్మకం తో మాకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని అందుకు సిపిఐ జిల్లా, తిరుపతి నగర పార్టీ కి కృతజ్ఞతలు తెలిపారు.

