
మన న్యూస్, కోవూరు ,మే 20:- మహానాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పండగ లాంటిది. – తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తుగా సైకిల్ సింబల్ పెట్టమని సూచించింది బుచ్చిరెడ్డి పాళెం వాసి బెజవాడ బెజవాడ పాపి రెడ్డి గారే. – ఛైర్ పర్సన్ సుప్రజ మురళి.ఎంపీ ,ఎమ్మెల్యేలుగా బుచ్చిరెడ్డి పాళెం పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్న వేమిరెడ్డి దంపతులకు ధన్యవాదాలు తెలిపారు ఛైర్ పర్సన్ సుప్రజ మురళి . కోవూరులో మంగళవారం జరిగిన మిని మహానాడులో ఆమె మాట్లాడుతూ….. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సంవత్సర కాలంలో ఐదేళ్ల అభివృద్ధికి పునాదులు వేసుకుంటూ ముందుకు పోతున్నారని కొనియాడారు. ప్రశాంతమ్మ ఎమ్మెల్యే అయ్యాక ప్రతి పక్ష నాయకులను విమర్శించడం, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టే సంస్కృతి కనుమరుగయింది అన్నారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక 20 ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నా సాధ్యం కాని బుచ్చిరెడ్డి పాళెం ఆటోనగర్ నిర్మాణానికి గెలిచిన ఏడాదిలోనే సాధించారన్నారు. ప్రభుత్వ నిధులు అందుబాటులో లేకున్నా తేజో డెవవలపర్స్ అనే సంస్థ వారిని ఒప్పించి దాదాపు 2 కోట్ల రూపాయల CSR నిధులతో మార్కెట్ నిర్మాణ పనులు చేయిస్తున్నారని తెలిపారు.రెండు వారల క్రితం పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం సందర్భంగా బుచ్చిరెడ్డి పాళెంలోని 7 వ వార్డులో ఇళ్ల మధ్య నుంచి పోయే గుడిపల్లి కాలువలో చిన్న పిల్లలు పడిపోతున్నారని స్థానికులు ఎమ్మెల్యే మేడం దృష్టికి తెచ్చిన వెంటనే స్పందించి కాలువ పై గ్రిల్ ఏర్పాటు చేయించారన్నారు. ఖజానగర్లో 10 కల్వరట్ల నిర్మాణనికి ఎంపి లాడ్స్ ద్వారా ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుచ్చి అభివృద్ధి కోసం పాటు పడుతున్నారని బుచ్చి పట్టణంలో తాగు నీటి సమస్య తీర్చేందుకు 12 లక్షల 50 వేలతో 5 బోర్లు చేయించారని పేర్కొన్నారు. మరో 25 లక్షల CSR నిధులతో కట్టుబడి పాళెంకు తాగునీటి పైప్ లైన్ నిర్మాణంతో పాటు బుచ్చి నగర పంచాయతిలో తాగు నీటి కోసం ప్రజలు యిబ్బంది పడకుండా 7 లక్షలు వెచ్చించి 11 స్పెర్ నీటి మోటార్లు అందుబాటులో వుంచారన్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చొరవతో బుచ్చి పట్టణంలో రోడ్ల, డ్రైన్ల నిర్మాణం కోసం 2 కోట్లు నిధులు మంజూరు చేశారన్నారు. అభివృద్ధి, యువతకు ఉపాధే లక్ష్యంగా పని చేస్తున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి ప్రజలు అండగా నిలువాలని కోరారు. ఇప్పటి దాకా మాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టె నాయకులను చూసాం కానీ ప్రజల కోసం పని చేసే నాయకులను వేమిరెడ్డి దంపతుల రూపంలో చూస్తున్నామన్నారు.
