శంఖవరం మన న్యూస్ (అపురూప్) : శంఖవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు రూ.3 లక్షల విలువచేసే విలువైన కంప్యూటర్లు, ప్రింటర్లను దుండగులు ఎత్తుకెళ్లారు. పాఠశాలలో గల కంప్యూటర్ గది తలుపులు పగలగొట్టి ఉండడంతో గమనించిన పాఠశాల ఇతర పనుల సహాయకుడు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కి సమాచారం అందించగా, ఆమె అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ శ్రీహరిబాబు కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ శ్రీహరి బాబు చోరీకి పాల్పడిన కంప్యూటర్ గదిని పరిశీలించి, ప్రత్యేక కోణంలో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఇదే పాఠశాలలో కంప్యూటర్ ఇతర సామాగ్రి చోరీకి పాల్పడ్డాయి. సుమారు వెయ్యి మందికి పైగా విద్యార్థులు కలిగిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు రాత్రి వేల కాపలాదారుడు లేకపోవడం గమనార్హం అని పలువురు అన్నారు. ఇప్పటికైనా జిల్లాలో గల విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకొని రాత్రివేళ కాపులదారుడను నియమించాలని పలువురు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *