

Mana News;- తిరుపతి, నవంబర్ 19(మన న్యూస్ )స్థానికులకు శ్రీవారి దర్శనం పునరుద్ధరిస్తూ టిటిడి పాలకమండలి నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తూ జనసేన పార్టీ ఎన్డీఏ నేతలకు పాలాభిషేకం నిర్వహించింది. మంగళవారం సాయంత్రం నాలుగుకాళ్ళమండపం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, టిటిడి బోర్డ్ ఛైర్మన్ బిఆర్ నాయుడు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. స్థానికులకు శ్రీవారి దర్శనం పునర్ధరిస్తామని ఇచ్చిన ఎన్నికల హామీ అమలులో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేసిన కృషి అభినందనీయమని జనసేన నాయకులు కొనియాడారు. సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ లకు జిందాబాద్ , ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నాయకత్వం వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగుకాళ్ళమండపం వద్ద జరిగిన సభలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు తిరుమల పవిత్రతను కాపాడుతామని చెబుతూ స్థానికులకు దర్శనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ అమలుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ లకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వినతి పత్రాలు అందించి కోరడంతో టిటిడి తొలి పాలకమండలి సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారని జనసేన నగర అధ్యక్షులు రాజా రెడ్డి తెలిపారు. తిరుమలను టూరిస్టు కేంద్రంగా గత ప్రభుత్వం మార్చి టిక్కెట్లు అమ్ముకుని స్థానికులకు దర్శనాన్ని రద్దు చేసిందని ఆయన ఆరోపించారు. తిరుమల పవిత్రత పునరుద్ధరణ ఎన్గీఏ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన చెప్పారు. స్థానికులకు దర్శనం పునరుద్దరించినట్లే తిరుపతిలో మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్స్ ఇచ్చేలా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కృషి చేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు హరిశంకర్, కార్పోరేటర్ వరికుంట్ల నారాయణ,మధుబాబు. ఆర్కాట్ కృష్ణ ప్రసాద్, బాబ్జీ, రాజేష్ ఆచ్చారి, సుభాషిణి, సునీల్ చక్రవర్తి, అశోక్, మునస్వామి, కెఎంకే లోకేష్, హేమంత్, వినోద్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.