ప్రచార ఆర్భాటాలు తప్ప మంత్రి నారాయణ నెల్లూరు నగరానికి చేస్తున్నది ఏమీ లేదు ,వాస్తవ వివరాలతో ధ్వజమెత్తిన……జిల్లా యువజన అధ్యక్షులు & కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున

మన న్యూస్ ,నెల్లూరు ,మే 10: నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గం కార్యాలయంలో శనివారం సాయంత్రం వైసీపీ జిల్లా యువజన అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున పాత్రికేయ సమావేశం నిర్వహించి మాట్లాడుతూ………… మంత్రి నారాయణకు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందన్నారు. అందుకే భగత్ సింగ్ కాలనీలో 1400 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తున్నామని.. డప్పు కొట్టుకుంటున్నాడని అన్నారు.గత వైసిపి ప్రభుత్వం లో భగత్ సింగ్ కాలనీకి వరదలు వచ్చిన సమయంలో మా నాయకుడు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి.. కాలనీవాసుల పరిస్థితిని చూసి.. వరదల నుంచి శాశ్వత రక్షణ కల్పించేలా 100 కోట్ల రూపాయలు రిటర్నింగ్ వాల్ నిర్మాణం కోసం మంజూరు చేశారని గుర్తు చేశారు. ఆ సమయంలోనే అక్కడ 3500 కుటుంబాలకు పొజిషన్ సర్టిఫికేట్.. ఇవ్వవలసిందిగా జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించడంతో.. వారందరికీ ఆరోజే పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగిందన్నారు.కేవలం వైసీపీ ప్రభుత్వంలోని.. 90% రిటర్నింగ్ వాల్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈ లోపల ఎన్నికలు రావడంతో.. పనులు కొంత ఆలస్యం అయ్యాయన్నారు.ప్రస్తుతం భగత్ సింగ్ కాలనీ వద్ద రిటర్నింగ్ వాల్ పనులు పూర్తి కావడంతో.. వైసిపి వాళ్ళకి ఈ క్రెడిట్ ఎక్కడ వెళ్తుందా అన్న.. భావనతో.. మంత్రి నారాయణ ఆగ మేఘాల మీద ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని తెరమీదకు తెచ్చారన్నారు.ఆరోజు వైసిపి ప్రభుత్వంలో రిటర్నింగ్ వాల్ నిర్మాణం జరగకుండా.. బాధితులకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఉంటే .. ఈరోజు మంత్రి నారాయణ.. పేద ప్రజలకు ఇళ్ళ పట్టాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టేవారా అని ప్రశ్నించారు.ఏది ఏమైనా అక్కడ స్థానికులకు ఇళ్లపట్టాలివ్వడం..సంతోషకరమన్నారు. 2019-24 ఐదేళ్ల వైసిపి ప్రభుత్వ కాలంలోలోనే.. నెల్లూరు నగరంలో అభివృద్ధి జరిగిందని.. దీనికి తెలుగుదేశం పార్టీ నేతలు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.ఈరోజు ..నెల్లూరులో పార్కుల మంత్రిగా.. పిలిపించుకునే నారాయణ.. వైసీపీ ప్రభుత్వంలో.. నిర్మించిన 13 డివిజన్ లోని మూడు పార్కులను.. తాను అభివృద్ధి చేసినట్టుగా బిల్డప్ ఇచ్చుకుంటున్నాడని అన్నారు. 13 వ డివిజన్ లో మూడు పార్కుల్లో.. వైసిపి ప్రభుత్వం లోనే పూర్తిస్థాయిలో పనులు పూర్తయినప్పటికీ.. ఎన్నికల్లో టిడిపి గెలిచిన తర్వాత మంత్రి నారాయణ ఆ పార్కులో పనిచేస్తున్న సిబ్బందిని బలవంతంగా తొలగించి.. ఈరోజు ఆ పార్కులను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఈరోజు మళ్లీ 13 డివిజన్ లో.. తన పార్టీ నాయకులకు 50 లక్షల రూపాయల కాంటాక్ట్ పనులు అప్పగించి .. వారి నాయకులకు లబ్ది చేకూరే విధంగా.. వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. ఒక్క పార్కుల అభివృద్ధి పనుల్లోనే ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంటే.. మిగిలిన పనుల్లో మంత్రి నారాయణ ఇంకా ఎంత.. అవినీతికి పాల్పడుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఈరోజు నెల్లూరులో తాము చేసిన అభివృద్ధి పనులకు రంగులు వేసుకోవడం తప్ప.. మంత్రి నారాయణ ఒక్క అభివృద్ధి పనైనా చేశారా చెప్పాలన్నారు. గత ఐదేళ్లలో.. నెల్లూరు నగరంలో తాము చేసిన 100 అభివృద్ధి పనులు చెప్పేందుకు మేము సిద్ధంగా ఉన్నామని.. 2014-19.. ఐదేళ్ల కాలంలో మంత్రి నారాయణ గారు.. సక్రమంగా చేసిన ఒక్క అభివృద్ధి పనినైనా చెప్పగలరా అని ప్రశ్నించారు. మేము శంకుస్థాపన చేసి.. పనులు పూర్తయిన.. నిర్మాణాలకు.. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నేతలు రిబ్బన్ కట్ చేసుకుంటున్నారే తప్ప.. వారు సొంతంగా చేసింది ఏమీ లేదన్నారు. నిజంగా టిడిపి నేతలు.. ప్రజలకు మంచి చేసే వారైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి లాంటి పథకాలు అమలు చేసి.. అప్పుడు టిడిపి నేతలు మాట్లాడాలని హితవు పలికారు.

  • Related Posts

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    సీతారామపురం అక్టోబర్ 29(మన ధ్యాస న్యూస్) రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా సీతారామపురంలోని కురవ వీధిలో బండి రోశమ్మ ఇంటి ప్రహరీ గోడ కూలింది మరియు ఇల్లు లోపల గోడ కూడా పాక్షికంగా దెబ్బతిని పడే స్థితిలో ఉన్నదని…

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    మన ధ్యాస ,విజయవాడ, అక్టోబర్ 29: ప్రపంచంలోని అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తిదారులలో ఒకటైన రుసల్, దాని ఉత్పత్తి ప్రక్రియలలో సామర్థ్యాన్ని పెంచడం మరియు ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరచడం వంటి రెండు ముఖ్యమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీలను ప్రవేశపెట్టింది.ప్రపంచ కార్యకలాపాలతో రష్యా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!