

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహ్మద్ నగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్యకర్తలకు అండగా పార్టీ ఎల్లప్పుడు కృషి చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి,యువజన మండల అధ్యక్షులు మల్లయ్య గారి ఆకాష్,ఎస్టిసెల్ ఉపాధ్యక్షులు లోక్య నాయక్,సవాయి సింగ్, సీనియర్ నాయకులు నాగభూషణంగౌడ్,ఖాలీక్,సంతోష్,తదితరులు ఉన్నారు.
