

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిరుపేదలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు వరమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.మొహమ్మద్ నగర్ మండలంలోని గుణ్కుల్ సొసైటీ ఫంక్షన్ హాల్ లో షాదీ ముబారక్ ,కళ్యాణ లక్ష్మి చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు,పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి లు కలిసి 24 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలోయువజన మండల అధ్యక్షులు మల్లయ్య గారి ఆకాష్,ఎస్టిసెల్ ఉపాధ్యక్షులు లోక్య నాయక్,తహసీల్దార్ సవాయి సింగ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొట్టం నర్సింలు,సీనియర్ నాయకులు నాగభూషణం గౌడ్,ఖాలీక్,సవాయి సింగ్,సంతోష్,తదితరులు ఉన్నారు.

